భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. 2025 జనవరి 7 వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు. ప్రాజెక్టులో అవినీతి కారణంగానే పిల్లర్లు కూలాయని.. నిజాలు తేల్చేందుకు అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రిని విచారించాలని పిటషనర్ తన పిటిషన్ లో కోర్టును కోరారు.