తమ సంస్థలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) వెల్లడించింది. సంస్థ పరిధిలో పని చేసే అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఏవరైనా లంచం అడిగితే 040 - 2345 4884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.