TS : రేవంత్ దూకుడు.. నోటీసులు బేఖాతరు

Update: 2024-05-01 07:04 GMT

అమిత్ షా రిజర్వేషన్ల ఫేక్ వీడియో సంచలనంగా మారింది. తెలంగాణ సీఎం చిక్కుల్లో పడ్డారని పరిశీలకులు అంటున్నా.. రేవంత్ మాత్రం దూకుడుగానే వెళ్తున్నారు. రిజర్వేషన్లపై మాట్లాడినందుకే తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్... వాటిని లెక్కచేయదల్చుకోలేదనే మెసేజ్ ఇచ్చారు.

ఆ నోటీసుల ప్రకారం నేడు ఢిల్లీలోని ఐఎఫ్ఎస్‌ఓ (ఇంటెలిజెన్స్ ఫ్యూజన్స్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్స్) ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారమే కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు రేవంత్ రెడ్డి.

దీంతో.. ఎన్నికల టైంలో ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సమన్ల ప్రకారం ఆయన హాజరయ్యే అవకాశం లేదని స్పష్టమైంది.మరోవైపు.. తాను రాజ్యాంగ రక్షణ కోసం ఏం చేశాననేది చెబుతూ మోడీ ప్రసంగాలు సాగుతున్నాయి.

Tags:    

Similar News