TG Cabinet Meeting : రేపే రేవంత్ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలు ఇవే

Update: 2025-03-05 07:45 GMT

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల కీలక నిర్ణయాలే ఎజెండాగా ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీ కరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించడంతో పాటు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో రెండో దఫా నిర్వహించిన కులగణన సర్వే, దానికి సంబంధించిన రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించేందుకు రెండు బిల్లులకు ఆమోదం తెలుప నున్నట్టు తెలిసింది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల్లో, మరొకటి విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబం ధించినది. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లుపై కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో ఇతర అంశాలపైనా చర్చించను న్నట్టు తెలుస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లకు ఆర్థిక సాయం, రేషన్ కార్డుల పంపిణీ ఇతరత్రా వంటి వాటిపై చర్చించనున్నారు.

Tags:    

Similar News