TG: హైదరాబాద్‌లో రూ.8,858 కోట్లతో కొత్త ప్రాజెక్టులు
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు చెక్ పెట్టే నిర్ణయం.. ఒకేసారి ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభించనున్న సీఎం.. హైబ్రిడ్ అన్యుటీ మోడల్లో ప్రాజెక్టుల నిర్మాణం
హైదరాబాద్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. మంచినీటి సరఫరా నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయడానికి, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించనున్నారు. ఫేస్-2, ఫేస్- 3 ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ మంచినీటి తరలింపు మరింత సులభతరమౌతుంది. గోదావరి మంచినీటి పథకం రెండు, మూడుదశల కోసం 7,360 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద మల్లన్నసాగర్ జలాశయం నుండి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ మంచినీటి అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ఏడు మధ్యస్థ సరస్సులను కూడా గోదావరి జిలాలతో నింపుతారు.
మల్లన్నసాగర్ నుంచి...
మొత్తం రూ.7,360 కోట్లతో చేపట్టిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌లో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందులో 2.5 టీఎంసీల నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల ద్వారా ముసీ నదికి వదిలి పునరుద్ధరిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మార్గంలో ఉన్న ఏడు మధ్యంతర చెరువులు కూడా నిండేలా చర్యలు తీసుకుంటున్నారు. హైబ్రిడ్ అన్యుటీ మోడల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో- ఔటర్ రింగ్ రోడ్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు మూడోదశనూ రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీనికి 1,200 కోట్లు రూపాయలు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిధి, దాని చుట్టుపక్కల గల మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలకు విస్తరించి ఉంది. అంతే కాకుండా.. రూ.1,200 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (ఫేజ్-2)ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ జిహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా అందించనుంది. మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా.. అందులో 15 రిజర్వాయర్లను ఈసారి ప్రారంభిస్తున్నారు. సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీ పురం, పటాన్చెరు, బోలారం ప్రాంతాల్లో 14 మండలాలకు చెందిన 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందుతుంది. కోకాపేట్ లేఅవుట్, నీయోపోలిస్, ఎస్ఈజడ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా.. మలినజల శుద్ధి కోసం రూ.298 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్ట్‌కు సీఎం పునాది వేయనున్నారు.