CM Revanth Reddy : కొత్త అసెంబ్లీ నిర్మాణానికి రేవంత్ ప్లాన్స్.. కోమటిరెడ్డి కీలక ప్రకటన

Update: 2024-10-23 10:00 GMT

తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని డిసైడైంది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాజసం ఉట్టిపడేలా ఈ నిర్మాణం వుండాలని అనుకుంటోంది. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే.. రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు. ఈ పునర్నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా పార్లమెంట్ సెంట్రల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే.. వాహనాలు ఉపయోగించక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. రెండు భవనాలు ఒకే దగ్గర ఉంటే సమయం ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Tags:    

Similar News