TG : ఫాంహౌజ్‌లు కూలుతాయనే హరీశ్, కేటీఆర్ డ్రామాలు.. రేవంత్ ఆగ్రహం

Update: 2024-10-04 06:45 GMT

పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని అక్రమ కట్టడాలు కూలగొట్టొద్దనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారని, భారాస నేతల నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏది చేపట్టినా.. రాజకీయం చేస్తూ అడుగడుగునా అడ్డు తగులుతున్న హరీష్ రావు, కేటీఆర్, సబితమ్మలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తమ ఫామహౌస్లను కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్ ఎస్ నేతలు నిమగ్నమై ఉన్నారని విమర్శించారు.

మేడ్చల్ జిల్లా సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని హాకీ గ్రౌండ్స్ లో గురువారం కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జెన్వాడలో ఉన్న కేటీఆర్ ఫాంహౌస్ అక్రమంగా కట్టింది కాదా అని ప్రశ్నించారు రేవంత్. అది కూలగొట్టాలా వద్దో చెప్పమన్నారు. అలాగే అజీజ్ నగర్లో ఉన్న హరీష్ రావు ఫాంహౌస్ అక్రమమా కాదా అని నిలదీశారు. సబితమ్మా.. నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫాంహౌస్లు కట్టినవ్ కదా? అవి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చడం తప్పా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సబితా ఇంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెనకాలే ఉన్న కేవీపీ రామచంద్రరావు ఫాంహౌస్ ను కూల్చాలా? వద్దా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News