తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డాక్యుమెంట్ పాలసీని తీసుకొచ్చింది. తెలంగాణ రైజింగ్ 2014 ను రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో మూడు రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నట్టు ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (కోర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) గా డివైడ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సిటీని మొత్తం కోర్ గా నిర్ణయించారు. ఈ కోర్ సిటీలో మెట్రో విస్తరణ, కాలుష్య నివారణ, మూసీ పునరుజ్జీవన, పార్కులను కాపాడటం, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఇండస్ట్రీలను బయటకు పంపించడం ఇందులో కీలకంగా ఉన్నాయి.
గతంలో హైదరాబాద్ కు వచ్చిన కంపెనీలు అన్నీ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండటంతో ఇప్పుడు అవన్నీ జనావాసాల మధ్య అయిపోయాయి. కాబట్టి వాటిని ప్యూర్ రీజియన్ లోకి పంపించాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న సిటీ మొత్తం ప్యూర్ కిందకు వస్తుంది. రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీ ప్యూర్ రీజియన్ లోనే ఉండబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కంపెనీలు అన్నీ ప్యూర్ రీజియన్ లోకి రాబోతాయి. వీటితోపాటు ఇకనుంచి వచ్చే కంపెనీలు అన్నీ కూడా ప్యూర్ సిటీలోనే ఉంటాయి. అక్కడ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ ను క్రియేట్ చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రేర్ రీజియన్ కిందికి తీసుకొస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, అగ్రికల్చర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం ఎందులో కీలకంగా ఉంది. ఇలా తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ 2047 వరకు దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.