Revanth Reddy : తెలంగాణ రూపురేఖలు మార్చనున్న గ్లోబల్ సమ్మిట్..

Update: 2025-12-04 09:30 GMT

రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సమ్మిట్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు కేంద్రమంత్రులు, పలువురు సీఎంలను, రాహుల్ గాంధీ, ఖర్గేను కూడా ఆహ్వానించారు. ఈ సమ్మిట్ పేరుతో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ మొదటి నుంచి పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. పైగా డెక్కన్ పీఠభూమి కాబట్టి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఎన్నో ఇక్కడ కొలువు తీరాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అతిపెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ సమ్మిట్ కోసం 500కు పైగా కంపెనీలను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 2000 మందికి పైగా వ్యాపార దిగ్గజాలు రాబోతున్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సమ్మిట్ లో వివరించి పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమ్మిట్ లో కొత్త పాలసీని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. తెలంగాణ రైసింగ్ 2047 లక్ష్యాన్ని కూడా ఇందులో వివరించబోతున్నారు.

ఫార్మా, ఐటీతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను హైదరాబాద్ రింగ్ రోడ్ అవతల పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ను మూడు రీజియన్లుగా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ప్యూర్ సిటీలోనే ఇప్పుడు రాబోతున్న కంపెనీలు అన్నీ కొలువుదీరుతాయి. రేవంత్ మొదటి నుంచి చెబుతున్న ఫ్యూచర్ సిటీ అంతా అక్కడే ఉండబోతోంది. ఈ లెక్కన తెలంగాణ రూపురేఖలు మార్చడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడబోతోంది.

Tags:    

Similar News