సీఎం రేవంత్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ విమర్శించారు. ‘ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని కుటుంబీకులను కోరుతున్నా. ఎవరినో కరిచేలా ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రైతుబంధు లేదని, అరకొర రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కోరారు.
‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు.
రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడన్నారు కేటీఆర్.