REVANTH: జడ్పీటీసీ టికెట్లు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

అర్హులకే టికెట్లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు

Update: 2025-10-02 03:00 GMT

తె­లం­గా­ణ­లో త్వ­ర­లో­నే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. ఈ క్ర­మం­లో అధి­కార కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఎన్ని­క­ల్లో ఎలా­గైన వి­జ­యం సా­ధిం­చా­ల­ని అడు­గు­లు కదు­పు­తోం­ది.అం­దు­లో భా­గం­గా జి­ల్లా పరి­ష­త్‌ ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చి అభ్య­ర్థుల ఎం­పిక కోసం ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టిం­ది. జడ్పీ­టీ­సీ­లు­గా పోటీ చే­సేం­దు­కు పె­ద్ద సం­ఖ్య­లో ఆశా­వ­హు­లు ముం­దు­కు వస్తు­న్న నే­ప­థ్యం­లో... ఒక్కో స్థా­నా­ని­కి ము­గ్గు­రి­తో ప్రా­థ­మి­కం­గా ఒక జా­బి­తా­ను సి­ద్ధం చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. జి­ల్లా ఇన్‌­చా­ర్జి మం­త్రు­లు తయా­రు చేసే జా­బి­తా­ను టీ­పీ­సీ­సీ­కి పం­ప­ను­న్నా­రు. అలా వచ్చిన జా­బి­తా­ల­ను పరి­శీ­లిం­చి జడ్పీ­టీ­సీ అభ్య­ర్థి­ని టీ­పీ­సీ­సీ ఫై­న­ల్‌ చే­య­నుం­ది. స్థా­నిక ఎన్ని­క­లు, మరో­వై­పు జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­కల నే­ప­థ్యం­లో అను­స­రిం­చా­ల్సిన వ్యూ­హం­పై టీ­పీ­సీ­సీ చీ­ఫ్‌ మహే­శ్‌­కు­మా­ర్‌­గౌ­డ్‌, పా­ర్టీ రా­ష్ట్ర వ్య­వ­హా­రాల ఇన్‌­చా­ర్జి మీ­నా­క్షి నట­రా­జ­న్‌, డి­ప్యూ­టీ సీఎం భట్టి­వి­క్ర­మా­ర్కతో రే­వం­త్‌ రె­డ్డి చర్చిం­చా­రు.

టికెట్లు వారికే..

టీపీసీసీకి వచ్చిన జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని రేవంత్‌ స్పష్టం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలో వారి గుణగణాలు, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న పరపతి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నిక సాఫీగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా, ఎంపీటీసీ అభ్యర్థులను స్థానికంగా డీసీసీ స్థాయిలోనే ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయింది.

పొన్నం, టీపీసీసీ చీఫ్‌తో సీఎం రేవంత్ కీలక చర్చ

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­కు సం­బం­ధిం­చిన కస­ర­త్తు­ను కాం­గ్రె­స్ పా­ర్టీ ప్రా­రం­భిం­చిం­ది. స్థా­నిక సం­స్థల ఎన్ని­కల షె­డ్యూ­ల్‌­తో పాటు జూ­బ్లీ­హి­ల్స్‌ ఎన్నిక షె­డ్యూ­ల్‌ కూడా వస్తుం­ది కా­బ­ట్టి.. కాం­గ్రె­స్ పా­ర్టీ తమ అభ్య­ర్థి ఎం­పి­క­పై ఫో­క­స్ పె­ట్టిం­ది. సీఎం రే­వం­త్‌ రె­డ్డి­తో పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్‌ కు­మా­ర్‌ గౌడ్, మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్ భేటీ అయ్యా­రు. ఈ భే­టీ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల అభ్య­ర్థు­ల­తో పాటు జూ­బ్లీ­హి­ల్స్‌ అభ్య­ర్థి­పై చర్చ జరి­గిం­ది. ఈ నెల 6న ఏఐ­సీ­సీ­లో స్క్రీ­నిం­గ్ కమి­టీ సమా­వే­శం జర­గ­నుం­ది. ఈ నే­ప­థ్యం­లో స్క్రీ­నిం­గ్ కమి­టీ సమా­వే­శం­కు ముం­దే అభ్య­ర్థుల ఎం­పి­క­ను పూ­ర్తి చే­యా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉపఎ­న్ని­క­కు కాం­గ్రె­స్‌ అభ్య­ర్థి ఎం­పి­క­పై రే­వం­త్‌ సమీ­క్షిం­చా­రు. దీ­ని­పై ని­వే­దిక ఇవ్వా­ల­ని ము­గ్గు­రు మం­త్రు­ల­కు ఆయన సూ­చిం­చా­రు. తా­జా­రా­జ­కీయ పరి­స్థి­తు­ల­ను వి­వ­రి­స్తూ.. ని­వే­ది­క­లో అభ్య­ర్థుల పే­ర్లు, వి­వ­రా­లు ఉం­డా­ల­ని పే­ర్కొ­న్నా­రు. గె­లు­పు గు­ర్రా­న్ని జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­లో ని­ల­బె­ట్టా­ల­న్న కో­ణం­లో­నే ని­వే­దిక ఉం­డా­ల­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో అధి­క­శా­తం స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కో­వా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. ఇన్‌­ఛా­ర్జ్‌ మం­త్రు­ల­తో­పా­టు ఎం­పీల భా­గ­స్వా­మ్యం­తో వె­ళ్లా­ల­ని సూ­చిం­చా­రు.



Tags:    

Similar News