Telangana News : జూబ్లీహిల్స్ లో పెరుగుతున్న టెన్షన్.. కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా..?

Update: 2025-11-06 08:15 GMT

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలపై తీసుకోవాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశా, నిర్దేశాలను ఇప్పటికే చేసేశారు. ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపైనే కాంగ్రెస్ గురి పెట్టినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందేనని సీఎం పట్టు మీద ఉన్నారంట. అందుకే మంత్రులు పూర్తిగా జూబ్లీహిల్స్ లోనే గల్లీ గల్లీ తిరుగుతున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ రెండు నెలల ముందు నుంచే చాలా అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. ఇప్పుడు డివిజన్ ఇన్ చార్జులతో ప్రతి రోజూ మాట్లాడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు బీఆర్ ఎస్ కూడా బలంగానే ప్రచారం చేస్తోంది. ఫలితం తేడా వస్తే పార్టీ మనుగడ సిటీలో అయోమయంలో ఉంటుందని బీఆర్ ఎస్ భావిస్తోంది. అందుకే కేటీఆర్, హరీష్‌ రావుతో పాటు కీలక నేతలంతా జూబ్లీహిల్స్ లోనే మకాం వేశారు. అసలే సిట్టింగ్ సీటు.. పైగా బీఆర్ ఎస్ కు బలం పెరిగిందని నిరూపించుకునే టైమ్ కాబట్టి ఇంత గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అయితే ప్రత్యర్థికి బలంగా ఉండే గల్లీలమీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రోడ్లు, డ్రైనేజీలు, కుల సంఘాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని ఆయా గల్లీల్లో కీలక హామీలు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇప్పటి వరకు జరిగిన ప్రచార తీరుపై ఇప్పటికే మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలో బీఆర్ ఎస్ తో కాంగ్రెస్ బలంగా పోటీ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చేశారంట. బీఆర్ ఎస్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని.. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేయాలన్నారు. ఎంఐఎం మద్దతుతో పాటు అజారుద్దీన్ కు మంత్రి పదవి లాంటివి ముస్లిం ఓట్లను కురిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రధానంగా బీఆర్ ఎస్ అభ్యర్థికి పడే ఓట్ల మీదనే గురి పెడుతోంది. బీఆర్ ఎస్ ను ఓడించడమే ప్రధాన ఫోకస్ గా పెట్టుకుంది. అధికార పార్టీ ఓడిపోతే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Full View

Tags:    

Similar News