Road Accident in America: కాలిఫోర్నియాలో కారు ప్రమాదం.. ఇద్దరు తెలుగమ్మాయిలు దుర్మరణం..

వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక మలుపును దాటలేక రోడ్డుపై నుంచి పక్కకు తప్పుకుని లోయలో పడిపోయిందని తెలుస్తోంది.

Update: 2025-12-29 08:45 GMT

ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం యువత విదేశాల బాట పడుతోంది. ఈ క్రమంలో అక్కడ జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగానో మరో కారణం చేతనో కొందరు బలవుతున్నారు. విదేశాకు వెళ్లి బాగా చదువుకుని మంచి జీవితం గడపాలనుకునే వారి కలలు కల్లలవుతున్నాయి ఇలాంటి సంఘటనలు ఆందోళ రేకెత్తిస్తున్నాయి.

అమెరికాలో ఉన్న తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో విషాదకరంగా మరణించారు. బాధితులను మహబూబాబాద్ జిల్లా గార్ల నుండి వచ్చిన 25 ఏళ్ల పులఖండం మేఘనా రాణి మరియు ముల్కనూర్ నుండి వచ్చిన 24 ఏళ్ల కడియాల భావనగా గుర్తించారు. ఆదివారం స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

మేఘన, భావన రెండు కార్లలో అలబామా హిల్స్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఎనిమిది మంది స్నేహితుల బృందంలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. దాంతో వారు ప్రాణాలు కోల్పోయారు.  మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఇటీవలే  ఇద్దరూ ఎంఎస్ పూర్తి చేసారు. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ విషాదం చోటు చేసుకుంది. వారి మరణ వార్త వారి కుటుంబాలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. 


Tags:    

Similar News