Government School: ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5వేలు.. ఎక్కడంటే..
Government School: అరకొర చదువులు, సౌకర్యాలు అంతంత మాత్రం.. ఈ అపోహను తొలగిస్తూ ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ పాఠశాలలపై దృష్టి సారిస్తోంది..;
Government School: అరకొర చదువులు, సౌకర్యాలు అంతంత మాత్రం.. ఈ అపోహను తొలగిస్తూ ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ పాఠశాలలపై దృష్టి సారిస్తోంది.. అన్ని వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఏ ఇతర పాఠశాలలో చదివిన విద్యార్థి తెలివి తేటలకు తక్కువ కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తోంది..
అయినా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలంటే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల చేరికను పేంచేదిశగా కొందరు అధికారులు ప్రణాళికలు చేపడుతున్నారు. అందులో భాగంగా మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్ధికి రూ.5 వేలు ఇస్తామంటూ సర్పంచి ఆకిటి మహేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనేయులు నిర్ణయించారు. దాతల సాయంతో అన్ని వసతులు కల్పిస్తూ, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూశారు.
దీంతో పాటు స్కూల్లో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ లు, బూట్లు, సాక్సులు, బస్ పాస్ అందిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.