సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు నారాయణఖేడ్ నుంచి జోగిపెటకు వెళ్తుండగా.. కన్సాన్‌పల్లి గ్రామ శివారులో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.