ఎమ్మెల్యే రాజయ్యపై కేసు నమోదు చేయండి: సర్పంచ్ నవ్య

ఎమ్మెల్యే రాజయ్యపై కేసు నమోదు చేయాలంటూ రెండు ఆడియో రికార్డ్స్ కాపీలను అందజేశారు.;

Update: 2023-06-26 08:45 GMT

జానకీపురం సర్పంచ్ నవ్య హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్యపై కేసు నమోదు చేయాలంటూ రెండు ఆడియో రికార్డ్స్ కాపీలను అందజేశారు. అయితే కేసు నమోదుకు రెండు ఆడియో రికార్డ్స్‌ సరిపోలేదని పోలీసులు తనతో చెప్పారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధర్మసాగర్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లాయర్ సలహా తీసుకుని మీడియాకు ఆడియో రికార్డ్స్‌ విడుదల చేస్తానని చెప్పారు.

సర్పంచ్ నవ్య సమర్పించిన ఆడియో రికార్డ్స్‌ లేనందువల్లే కేసు నమోదు చేయలేదని ధర్మసాగర్‌ సీఐ అన్నారు. తాము ఇచ్చిన నోటీసులకు సరైన ఆధారాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆధారాలు ఎప్పుడు ఇచ్చినా ఎమ్మెల్యే రాజయ్యపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News