చిన్నపాటి ఎన్నికల ఫలితాలైనా సరే.. సందడిగా కనిపించే తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రాకపోవడంతో బోసిపోయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశలు కూడా లేకపోవడం వల్లనే ఇటు వైపు రాలేదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టీవీలకు అతుక్కు పోవడంతో ఎవరూ రాలేదు.
పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన హడావుడి అసలే కనిపించలేదు. గెలుపుపై ఆశలు లేక ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఫలితాలు వెలువడే రోజూ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద సందడి చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తక్కువ సీట్లకే పరిమితం కావడంతో కేడర్ అంతా నైరాశ్యంలో ఉంది.
లోక్ సభ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ.. ఫలితాల్లోనూ 17 పార్లమెంట్ స్థానాల్లో లెక్కింపుల్లోనూ ప్రతిరౌండ్లోనూ వెనుకబడే ఉండటంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అటువైపు రాలేదు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనట్టుగా తెలంగాణ భవన్ సైలెంట్ అయింది.