School Timings : మళ్లీ మారనున్న స్కూల్ టైమింగ్స్

Update: 2024-05-27 07:40 GMT

తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదేశాల ప్రకారం ఉదయం 9 గంటలకే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.

గతంలో కూడా 9 గంటలకే ప్రారంభమయ్యేవి. కానీ, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్కూల్స్ పని వేళలను ఉదయం 9.30 గంటలకు మార్చారు. దీనికి ఆయన ఒక కారణాన్ని అప్పట్లో ప్రభుత్వానికి సూచించారు. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్ధులు ఉంటే.. ఒకరిని 9 గంటలకు, మరొకరిని 9.30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పని వేళల్లో మార్పులు చేయాలని ఎమ్మెల్సీ కోరగా.. దానిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యాశాఖ అధికారులు భావించి నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉన్నత పాఠశాలలు మాత్రం 9.30 గంటలకే మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 4.15 గంటల వరకు స్కూల్స్ నడవనున్నాయి.

Tags:    

Similar News