గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సామాజిక ఖాతా, మెయిల్ ఐడీలు హ్యాకు గురయ్యాయి. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ఆయన పేరుతో శ్రీబుర్రా వెంకటేషం జీ మెయిల్ డాట్ కామ్ పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేశారని ఫిర్యాదు చేశారు.
ఆయన పేరుతో ఫేక్ ఖాతా క్రియేట్ చేసి హ్యాక్ చేశారని అధికారులు తెలిపారు. హ్యాక్ కు గురైన జీమెయిల్ ఖాతానుంచి వచ్చే మెయిల్స్/వాట్సాప్ సందేశాలకు ప్రతిస్పందించవద్దని, హ్యాకర్స్ ఎవరినైనా సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆ ఖాతాను బ్లాక్ చేయాలని అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఆ హ్యాకర్ ను, నేరస్థుడిని గుర్తించగలిగితే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రకటనలో కోరారు.