sheeps scam: గొర్రెలు కొనలేదు..అమ్మలేదు..వెయ్యి కోట్లు మాయం

గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ప్రకటన..గొర్రెలు కొనకుండానే డబ్బులు స్వాహా.. రూ.100 కోట్ల అక్రమాలు గుర్తింపు;

Update: 2025-08-02 03:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో కీలక పరిణామం సంభవించింది. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల విలువ రూ.1000 కోట్లు పైనే ఉంటుందని ఈడీ కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ జిల్లాల్లో ఈ స్కీం కింద ఎంత మేరకు అక్రమాలు జరిగాయో పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించడం తీవ్ర సంచలనంగా మారింది.

తె­లం­గా­ణ­లో సం­చ­ల­నం సృ­ష్టిం­చిన గొ­ర్రెల పం­పి­ణీ పథ­కం­లో రూ.వె­య్యి కో­ట్ల­కు­పై­నే అక్ర­మా­లు జరి­గి­న­ట్లు ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్‌ డై­రె­క్ట­రే­ట్‌(ఈడీ) ప్రా­థ­మిక దర్యా­ప్తు­లో గు­ర్తిం­చిం­ది. గొ­ర్రెల పెం­ప­కం, అభి­వృ­ద్ధి పథకం అమ­లు­లో భారీ అవ­క­త­వ­క­లు జరి­గా­య­ని ఆరో­పి­స్తూ అవి­నీ­తి ని­రో­ధక శాఖ నమో­దు చే­సిన రెం­డు ఎఫ్‌­ఐ­ఆ­ర్‌ల ఆధా­రం­గా ఈడీ అధి­కా­రు­లు రం­గం­లో­కి ది­గా­రు. గత ప్ర­భు­త్వం­లో­ని పశు­సం­వ­ర్ధక శాఖ మం­త్రి తల­సా­ని శ్రీ­ని­వాస యా­ద­వ్‌ ఓఎ­స్డీ­గా ఉన్న జి. కల్యా­ణ్‌ కు­మా­ర్‌, ఇతర లబ్ధి­దా­రు­లు, మధ్య­వ­ర్తుల ని­వా­సా­ల్లో సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. ఈ సో­దా­ల్లో అనేక ఆధా­రా­లు సే­క­రిం­చి­న­ట్లు ఈడీ అధి­కా­రు­లు ప్ర­క­టిం­చా­రు. వి­విధ ప్ర­భు­త్వ అధి­కా­రు­ల­కు ము­డు­పుల రూ­పం­లో అక్రమ చె­ల్లిం­పు­లు జరి­గి­న­ట్లు సూ­చిం­చే పత్రా­ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. 200కు­పై­గా బ్యాం­క్‌ ఖా­తా­ల­కు సం­బం­ధిం­చిన చె­క్‌­బు­క్‌­లు, పా­స్‌­బు­క్‌­లు, డె­బి­ట్‌ కా­ర్డు­లు, 31 సె­ల్‌­ఫో­న్లు, 20 సి­మ్‌­కా­ర్డు­ల­ను సీ­జ్‌ చే­శా­రు. గొ­ర్రెల పం­పి­ణీ స్కీం లో లబ్ధి­దా­రు­లు అసలు గొ­ర్రెల వ్యా­పా­రం­తో సం­బం­ధం లే­ని­వా­రు ఉన్న­ట్లు ఈడీ అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. అసలు గొ­ర్రెల కొ­ను­గో­లు లేదా వి­క్ర­యం జర­గ­లే­ద­ని.. కానీ వె­య్యి కో­ట్ల రూ­పా­య­లు మాయం చే­సి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. నకి­లీ వి­క్రే­త­లు, ఫేక్ బి­ల్లు­ల­ను మళ్లీ మళ్లీ పే­ర్కొం­టూ డబ్బు­లు దో­చు­కు­న్న­ట్టు ఆధా­రా­లు గు­ర్తిం­చా­రు. ఈడీ సో­దా­ల్లో ప్ర­భు­త్వ అధి­కా­రు­ల­కు, ఇత­రు­ల­కు కి­క్‌­బ్యా­క్ లకు సం­బం­ధిం­చిన డా­క్యు­మెం­ట్లు, నకి­లీ చెక్ బు­క్‌­లు, పా­స్‌­బు­క్‌­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు.

రికార్డుల ఆధారంగా...

పశు­సం­వ­ర్ధక శాఖ, గొ­ర్రె­లు, మేకల డె­వ­ల­ప్మెం­ట్ ఫె­డ­రే­ష­న్ లో సీజ్ చే­సిన గొ­ర్రెల పం­పి­ణీ స్కీ­మ్ రి­కా­ర్డు­లు, బ్యాం­కు స్టే­ట్మెం­ట్ ల ఆధా­రం­గా ఈడీ వి­చా­ర­ణ­లో నిం­ది­తు­ల­ను ప్ర­శ్ని­స్తుం­ది. గొ­ర్రె పి­ల్లల కొ­ను­గో­లు, తర­లిం­పు, లబ్ధి­దా­రు­ల­కు అప్ప­గింత, ని­ధుల బద­లా­యిం­పు వరకు ఆర్థిక శాఖ మం­జూ­రు చే­సిన ని­ధు­ల­కు సం­బం­ధిం­చిన రి­కా­ర్డు­లు కీ­ల­కం­గా మా­రా­యి. ని­ధుల దారి మళ్లిం­పు­కు సూ­త్ర­ధా­రు­లైన కల్యా­ణ్ సహా మరో ఇద్ద­రి­ని అరె­స్టు చే­సేం­దు­కు ఈడీ సి­ద్ధ­మ­వు­తుం­ది. కం­ప్ట్రో­ల­ర్‌ అం­డ్‌ ఆడి­ట­ర్‌ జన­ర­ల్‌(కా­గ్‌) ని­వే­దిక కూడా గొ­ర్రెల పం­పి­ణీ­లో కుం­భ­కో­ణం జరి­గి­న­ట్లు గు­ర్తిం­చిం­ది. మా­ర్చి 2021తో ము­గి­సిన కా­లా­ని­కి సం­బం­ధిం­చిన కా­గ్‌ ని­ర్వ­హిం­చిన ఆడి­ట్‌­లో పథకం అమ­లు­లో అనేక అవ­క­త­వ­క­లు జరి­గి­న­ట్లు వె­ల్ల­డైం­ది. లబ్ధి­దా­రుల వి­వ­రా­ల­ను సరి­గ్గా ని­ర్వ­హిం­చ­క­పో­వ­డం, రవా­ణా ఇన్వా­యి­స్‌ రి­కా­ర్డు­లు అసం­పూ­ర్ణం­గా ఉం­డ­టం, నకి­లీ వాహన నం­బ­ర్ల­తో కూ­డిన ఇన్వా­యి­స్‌­కు చె­ల్లిం­పు­లు చే­య­డం వం­టి­వి గు­ర్తిం­చా­రు. తె­లం­గా­ణ­వ్యా­ప్తం­గా రూ.వె­య్యి కో­ట్ల­కు­పై­గా అక్ర­మా­లు జరి­గా­య­ని ఈడీ అం­చ­నా వే­సిం­ది. ఈ కుం­భ­కో­ణం­లో ఎవరి పా­త్ర ఎంత, ఇంకా ఎం­త­మం­ది అక్ర­మా­ల­కు పా­ల్ప­డ్డా­ర­నే వి­ష­యం­పై దర్యా­ప్తు కొ­న­సా­గి­స్తోం­ది.

Tags:    

Similar News