Samoohika National Anthem : సామూహిక జాతీయ గీతాలాపన నేడే..

Samoohika National Anthem : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభంగా నిర్వహిస్తోంది.

Update: 2022-08-16 01:45 GMT

Samoohika Nationa Anthem : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభంగా నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణవ్యాప్తంగా ఒకే సమయంలో ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ ఆబిడ్స్ జీపీవో కూడలి వద్ద గీతాలాపనలో పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలకు హాజరవుతారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోను ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేశ్‌ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

జాతీయ గీతాలాపన సమయంలో కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్‌ సిగ్నళ్లు వేస్తారు. 11.30 గంటలకు ట్రాఫిక్‌ను ఒక నిమిషం పాటు నిలిపివేసి.. అలారం మోగించే విధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లు చేశారు పోలీసులు. గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్‌ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం చేయడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ గీతాలాపనలో భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లలో ఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశ భక్తిని చాటాలన్నారు.

Tags:    

Similar News