హైదరాబాద్ ప్రజల తరపున బీజేపీ చార్జ్‌షీట్ దాఖలు చేసిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆమె... టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. టీఆర్‌ఎస్- ఎంఐఎం రెండు ఒక్కటేనన్నారు. ఎంఐఎంకి టీఆర్‌ఎస్ మద్దతు లేనిదే.. రొహింగ్యాలు హైదారాబాద్‌లో ఉండగలుగుతున్నారా అని ప్రశ్నించారు స్మృతి ఇరానీ. అక్రమ వలసదారులకు టీఆర్‌ఎస్-ఎంఐఎం మద్దతిస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపైనా ఇరానీ స్పందించారు. అవినీతి, అభివృద్ధి , టీఆర్‌ఎస్ తీరుపైనే సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు.