Rains in Telangana : నైరుతి చల్లని కబురు.. జూన్ ఫస్ట్ వీక్‌లో దంచికొట్టనున్న వానలు

Update: 2024-05-28 06:23 GMT

జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు.. తెలంగాణ రాష్ట్రాన్ని పలకరిస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది.

రుతుపవనాల రాకకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. రుతుపవనాలు కేరళను తాకిన అనంతరం దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. ఈ లెక్కన జూన్ 5, 6 తేదీల్లో నైరుతి తెలంగాణను పలుకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాలకాలంగా పేర్కొంటారు.

రైతులు సాగు కోసం నైరుతి పైనే ఎక్కువగా ఆధారపడతారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ చేసిన ప్రకటనపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Tags:    

Similar News