● హైదరాబాద్ మహా నగరానికి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ పునఃప్రారంభం
● ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ వర్సిటీల ఏర్పాటు
● హైదరాబాద్– బెంగళూరు ఐటీ– ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – నాగపూర్, హైదరాబాద్ –వరంగల్, హైదరాబాద్ – నల్గొండ – మిర్యాలగూడ, సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్లు
● భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం.
● హైదరాబాద్‌లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
● నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు
● రామగుండం–మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు
● 4 నూతన సైనిక పాఠశాలలు
● కేంద్రీయ విద్యాలయాల పెంపు
● నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
● జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
● ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఏర్పాటు
● ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు
● భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఇరి) క్యాంపస్ ఏర్పాటు
● నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
● అధునాతన వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
● డ్రై పోర్టు ఏర్పాటు.
● హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
● మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా
● 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్‌లకు నేరుగా బదిలీ
● పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
● ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు