దక్షిణయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభంకానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం, మరుసటి రోజున శ్రీ స్వామి వారి పట్టాభిషేకం తిలకించడానికి ఈ నెల 20 నుంచి వివిధ సెక్టార్లకు సంబంధించిన టికెట్స్ నేరుగా, 12వ తేదీ బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్లు రామాలయం ఈవో రమాదేవి తెలిపారు. కళ్యాణం, పట్టాభిషేకానికి రాలేని భక్తుల కోసం పరోక్ష సేవలు పొందవచ్చని అన్నారు. ఆన్లైన్లో టికెట్స్ భద్రాద్రి టెంపుల్. తెలంగాణ.గౌ.ఇన్ ద్వారా 12వ తేది నుండి పొందవచ్చని తెలిపారు. ఉభయ దాతల కోసం 7500 రూపాయలతో ఇద్దరు కళ్యాణానికి, పట్టాభిషేకానికి హాజర య్యేలా టికెట్లు ఆన్లైన్లో ఉంచారు. ఇదే క్రమంలో రూ.2500 మొదలుకొని వంద రూపాయలు వరకు భక్తులకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.