నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లను మూసివేశారు. 41 గేట్ల ద్వారా రెండు రోజులు దాదాపు 30 టీఎంసీల వరకు వరద నీటిని దిగువ గోదావరికి వదిలారు.
నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.017 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా ఇన్‌ఫ్లో 31 వేల 650 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల 500, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.