హైడ్రా బాధితులకు ఊరట దక్కింది. కూల్చివేతలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ ముందస్తు ఆదేశాలు లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టొద్దంటూ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను బేఖాతర్ చేశారంటూ అసోంలోని 47 మంది .. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతులు లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టొదని స్పష్టం చేసింది. ఈ తీర్పు హైడ్రాకు కూడా వర్తిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.