TG : బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా సురేశ్‌రెడ్డి

Update: 2024-06-18 05:15 GMT

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పక్షనేతగా కేఆర్ సురేశ్ రెడ్డిని ( Suresh Reddy ) నియమిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ( KCR ) వెల్లడించారు. కె.కేశవరావు స్థానంలో సురేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌లకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోగానే ఎంపీ కేశవరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

పార్టీ పార్లమెంటరీ నేతగా నియమించినందుకు కేసీఆర్‌కు సురేశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో సురేశ్‌రెడ్డిని రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, ఇతర ఎంపీలు, పార్టీ నేతలు అభినందించారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటూ దక్కలేదు.

కేఆర్‌ సురేశ్‌ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కిందిస్థాయి నుంచి పైకి ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా సురేశ్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగుసార్లు బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో ఐదేండ్లు స్పీకర్‌గా పనిచేశారు. గత నాలుగేండ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News