Marredpally Tahsildar : మారేడుపల్లి తహసీల్దార్‌ సస్పెన్షన్‌

Update: 2024-06-21 10:39 GMT

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మారేడుపల్లి తహసీల్దార్‌ పద్మసుందరితో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రసన్నలక్ష్మి, రికార్డు అసిస్టెంట్‌ ఎస్‌.రవిలను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సస్పెండ్‌ చేశారు. మారేడుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ వచ్చే సమయంలో కార్యాలయంలో తహసీల్దార్‌ లేకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయంలో చిరు ఉద్యోగులు వసూళ్లకు పాల్పడడంతో పాటు మూడు రోజుల క్రితం మహేంద్రహిల్స్‌లో ఓ ఐఏఎస్‌ ఇంటికి బోర్‌ వేస్తుండగా రెవెన్యూ సిబ్బంది బోర్‌ను సీజ్‌ చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో ఐఏఎస్‌ కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. దరఖాస్తు దారులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలన్నారు. తనిఖీల్లో భాగంగా మారేడుపల్లి కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌ తహసీల్దార్‌తో పాటు ఇద్దరిని సస్పెండ్‌ చేశారు.

Tags:    

Similar News