తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆదివారంతో మూడేళ్లు పూర్తవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంతోషం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సారథ్యంలో విజయభేరి సభ నిర్వహించడం, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తన జీవితంలో మరువలేని ఘట్టాలని చెప్పారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో రేవంత్ రెడ్డి తన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఫొటో షేర్ చేశారు. తనపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీకి, సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నుంచి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం.. తక్కువ కాలంలో పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం కావడం అనేది దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు.