TS : చిహ్నంలో అమరవీరుల త్యాగం.. మల్లు రవి క్లారిటీ

Update: 2024-05-31 10:30 GMT

2023 ఎన్నికల కంటే ముందు PCC చీఫ్ గా ఒక అజెండాను రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచారని చెప్పారు కాంగ్రెస్ నేత మల్లురవి. రాచరిక పాలన తీసి ప్రజా పాలన తీసుకోస్తాం అన్నారనీ.. అందులో భాగంగా రాచరిక చిహ్నాలను తీసేస్తున్నారని చెప్పారు.

ప్రజా పాలనలో భాగంగానే జయజయహే తెలంగాణ పాటని అధికారిక గీతం చేస్తున్నారనీ.. ప్రభుత్వం అంటేనే చిహ్నమనీ... అది ముఖ్యమైన ప్రజా చిహ్నం అమరవీరుల త్యాగం అన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన వాళ్లని చిహ్నంలో పెట్టాలని ప్రజా పాలన కోరుకుంటోందన్నారు. హిస్టరీ తెలియని వాళ్లు పాలనకు అనర్హులనీ.. రేవంత్ కి చరిత్ర తెలుసు కాబట్టే గొప్ప వాళ్ళని కలుపుకొని పోతున్నారని చెప్పారు.

జరగబోతున్నవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కాదనీ.. ప్రభుత్వం, ప్రజల కార్యక్రమాలని గుర్తుచేశారు మల్లురవి. తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీకి అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలిసిన సమయమిది అన్నారు.

Tags:    

Similar News