Talasani Srinivas Yadav : కొందరు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు : తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav : దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav : దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్టీఆర్ మార్గ్ నుంచి టాంక్‌బండ్ వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను GHMC మేయర్ విజయలక్ష్మితో కలసి మంత్రి పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్నీ పండుగలకు ఘనంగా ఏర్పాట్లను చేస్తుందని, ఈనెల 9న జరిగే నిమజ్జన ఉత్సవాలకు కూడా అన్నీ ఏర్పాట్లను చేశామని ఎవరూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం అన్నీ జాగ్రత్తలు తీసుకుందని మంత్రి తెలిపారు. కొందరు నిర్వాహకులు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందొద్దని మంత్రి తలసాని అన్నారు.