డబ్బు, మద్యంతో టీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెడుతోంది : తరుణ్ చుగ్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్.;
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్. డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. నాగార్జునుడు నడియాడిన నేలను టీఆర్‌ఎస్ అపవిత్రం చేస్తుందని ధ్వజమెత్తారు. సాగర్ ఉప ఎన్నిక ప్రణాళికపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి సమీక్షించారు.