హైదరాబాద్ : పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు
కరోనా ను డోంట్ కేర్ అంటున్నారు హైదరాబాద్‌లో కొందరు యువత.. వైరస్‌ను లెక్క చేయకుండా పబ్‌ల్లో హంగామా చేస్తున్నారు.. నిన్న అర్థరాత్రి హైదరాబాద్‌లోని..;
కరోనా ను డోంట్ కేర్ అంటున్నారు హైదరాబాద్‌లో కొందరు యువత.. వైరస్‌ను లెక్క చేయకుండా పబ్‌ల్లో హంగామా చేస్తున్నారు.. నిన్న అర్థరాత్రి హైదరాబాద్‌లోని పలు పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో పలు పబ్బులపై సోదాలు నిర్వహించారు..
దాదాపు నాలుగు పబ్బుల్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అర్థరాత్రి వరకు పబ్‌లు తెరవకూడదనే నిబంధనను బేఖాతరు చేస్తూ.. మ్యూజిక్‌తో డ్యాన్స్‌ఫ్లోర్లు ఓపెన్ చేసిన నాలుగు పబ్బులపై చర్యలు తీసుకున్నారు. నలుగురు పబ్ యజమానులను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పచెప్పారు.