భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సీఎం కేసీఆర్ కు సంజయ్ సవాల్

Update: 2020-11-20 06:44 GMT

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చని సిటీ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. సంజయ్ ఆలయానికి వెళ్లే దారిలో వీడియో రికార్డు చేస్తామని.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. అనుమతి లేదని వస్తున్న వార్తలు అవాస్తమని.. సంజయ్ ను వెళ్లనీయకుండా పోలీసులు ఆపడం లేదని అంజనీకుమార్ స్పష్టంచేశారు.

ఉదయం నుంచే హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. వరద సాయం ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈ లేఖపై నిజాలు తేల్చుకుందామని.. మధ్యాహ్నం 12 గంటలకు పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సీఎం కేసీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి బండి సంజయ్ బయలుదేరే అవకాశం ఉండడంతో పోలీసులు బీజేపీ ఆఫీస్ ముందు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.



Tags:    

Similar News