కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించనున్న నేపథ్యంలో సీఈసీకి తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది. ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ నేతల బృందం ఈమేరకు పార్టీ తరఫున వినతిపత్రం అందించింది. ఎస్ఐఆర్ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్రువపత్రాల విషయంతో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది. ఎస్ఐఆర్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, ఎవరి ఓట్లు తొలగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతలు తెలిపారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, కూన రవికుమార్ తదితరులు సీఈసీని కలిసిన వారిలో ఉన్నారు. ఓటర్ల జాబితా ధ్రువీకరణను బలోపేతం చేయాలి. కాగ్ ఆధ్వర్యంలో ఏడాదికోసారి థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహించాలని... ఓటర్ల జాబితా రూపొందించడంలో ఏఐ సాయం తీసుకోవాలని సూచించింది,.