Sabita vs Teegala : కబ్జా ఆరోపణలు ఇష్యూ కాదు : మంత్రి సబిత
Sabita vs Teegala : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్
Sabita vs Teegala :
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్
నేను భూకబ్జాలకు పాల్పడి ఉంటే విచారణ జరుపుకోవచ్చు - మంత్రి సబిత
తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారు - మంత్రి సబితా
ఒకవేళ నాపై కబ్జా ఆరోపణలు వస్తే.. వాటిపై సీఎం కేసీఆర్ విచారించి చర్యలు తీసుకుంటారు - మంత్రి సబితా
తీగల కృష్ణారెడ్డితో కలిసి మాట్లాడుతాను - మంత్రి సబిత
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన భూకబ్జా ఆరోపణలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను కబ్జాలకు పాల్పడి ఉంటే విచారణ జరుపుకోవచ్చని సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారని అన్నారు. ఒకవేళ తనపై భూకబ్జాల ఆరోపణలు వస్తే.. వాటిపై సీఎం కేసీఆర్ విచారించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. తీగల కృష్ణారెడ్డితో కలిసి మాట్లాడుతానని.. కబ్జా ఆరోపణలు పెద్ద ఇష్యూ కాదంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొట్టిపారేశారు.