Telangana Assembly: ఏడేళ్లుగా పోడు భూములకు పట్టాలిస్తాన్నన్న సీఎం హామీ ఏమైంది..?: సీతక్క
Telangana Assembly: పోడు భూముల వ్యవహారంపై టీఆర్‌ఎస్ సర్కార్ కావాలనే నాన్చుతోందని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.;
Telangana Assembly: పోడు భూముల వ్యవహారంపై టీఆర్‌ఎస్ సర్కార్ కావాలనే నాన్చుతోందని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పోడుభూములపై అసెంబ్లీలో చర్చిస్తారని అనుకుంటే...ఆ అంశం ప్రస్తావనే లేదన్నారు సీతక్క. పోడుభుములపై గిరిజనులకు ఏడేళ్లుగా పట్టాలిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు సీతక్క.
పోడుభూముల హక్కుల కోసం ప్రభుత్వానికి రెండు లక్షల మేర దరఖాస్తులు వస్తే.. ఒక మేరకైనా పరిష్కరించలేదన్నారు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడుభూములపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.