తెలంగాణ BRSలో ఊపందుకున్న ఎన్నికల హడావుడి

Update: 2023-08-21 07:48 GMT

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ తొలి జాబితాను రెడీ చేసేందుకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ రెడీ అయ్యారు. తొలి ఆజబితాకు సంబంధించిన కసరత్తును గులాబీ బాస్‌ ఇప్పటికే పూర్తి చేశారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించే ఉద్దేశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చాలా ముందే ప్రారంభించారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేశారు. దాదాపు 87 మందితో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్న నియోజక వర్గాలతో పాటు ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫస్ట్ లిస్ట్‌లో స్థానం లభించలేదని తెలుస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్ మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని సిట్టింగ్స్‌లో టెన్షన్ నెలకొంది. మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్‌లో మార్పులు లేవని తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్‌లో మూడు చోట్ల.. వరంగల్‌లో రెండు చోట్ల సిట్టింగ్‌లను మార్చే అవకాశముంది. ఇక ఖమ్మంలో ఇద్దరిని మారుస్తారని తెలుస్తోంది. కరీంనగర్‌లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చే అవకాశముంది. రంగారెడ్డి జిల్లాలోనూ మార్పు తప్పదని తెలుస్తోంది. ఉప్పల్, జనగాం, స్టేషన్ ఘనపూర్, ఇల్లెందు, వైరా, ఆసిఫాబాద్‌, ఖానాపూర్, వేములవాడ, బోథ్, మెదక్, నర్సాపూర్‌లో మార్పు ఖాయంగా కన్పిస్తోంది.

Tags:    

Similar News