ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకే అసెంబ్లీ ప్రొరోగ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా.. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. సమావేశం అనంతరం ఎన్నికలపైనా కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ కేబినెట్‌లో చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అమలుపైనా చర్చించారు.