TG : ఈ నెల 20న తెలంగాణ కేబినెట్‌ భేటీ

Update: 2024-09-16 15:15 GMT

సెప్టెంబర్ 20న తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఆర్‌వోఆర్‌ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్‌, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, హైడ్రాకు చట్టబద్దత ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అంశం, బీసీ రిజర్వేషన్‌, కులగణన, రుణమాఫీ, రైతుభరోసా, భూమాత పోర్టల్ పై చర్చించే అవకాశం ఉంది.

Tags:    

Similar News