KCR In Assembly : తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది: సీఎం కేసీఆర్
KCR In Assembly : తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.;
KCR In Assembly : తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయంపై... మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమాధానం అనంతరం కేసీఆర్ మాట్లాడారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లోనూ కేంద్రం... తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో చారిత్రక ఉజ్వలమైన అవశేషాలు ఉన్నా...కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఖమ్మంలోని పాండవుల గుట్టను పట్టించుకోలేదన్నారు. మగధ సామ్రాజ్యం విశిష్టంగా, వైభవంగా ఉండేనో.. శాతావాహనుల చరిత్ర కూడా అంతే గొప్పదన్నారు కేసీఆర్.