KCR with Prashant Kishor : సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ
KCR with Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు.;
KCR with Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐప్యాక్ టీమ్ తెలంగాణకు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కలిసి పనిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే నిన్న పీకే వచ్చారని చెబుతున్నారు.
ప్రశాంత్ కిషోర్‌తో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సీఎంను కలిశారు. నిన్నటి భేటీకి ప్రకాష్‌రాజ్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మొన్న మహారాష్ట్ర పర్యటనలోనూ ప్రకాష్ రాజ్‌ను వెంటబెట్టుకునే వెళ్లారు కేసీఆర్. ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్‌తో జరిపిన చర్చల్లో సీఎం కేసీఆర్ బృందంలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. పైగా ఈసారి ప్రకాష్‌రాజ్‌కు రాజ్యస నిన్న ఎర్రవల్లిలో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్, ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
సీఎంతో భేటీ తరువాత ప్రకాష్‌రాజ్, ప్రశాంత్ కిషోర్.. గజ్వేల్‌లో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా మల్లన్న సాగర్, తుక్కాపూర్ పంప్‌హౌస్‌ను ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా చూసొచ్చారు. తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మ సాగర్‌ను కూడా పరిశీలించారు. వీరి వెంట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటి పారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ గురించి వివరించారు. వచ్చే ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిగినట్టు చెబుతున్నారు.