TS : ఫిబ్రవరి 15న సెలవు.. సర్కారు నిర్ణయం

Update: 2024-02-10 06:52 GMT

తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంజారాల ఆరాధ్యుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15ను హాలీడేగా ప్రకటించింది. సకల జనులను కలుపుకుని ప్రజా ప్రభుత్వం నడుపుతామని చెప్పిన రేవంత్ .. అదే దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

సేవాలాల్ జయంతి సమయానికి హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ట్యాంక్ బండ్ మీద సేవాలాల్ మహరాజ్ విగ్రహం పెడతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి తెలిపారు. సంత్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి దగ్గర్లోని గొల్లలదొడ్డి సేవాగఢ్‌లో జన్మించాడని చెబుతారు. ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త, బ్రహ్మచారి అయిన సేవాలాల్.. తన అద్భుతమైన బోధనలతో తన వాదాన్ని వ్యాప్తి చేశారు. బంజారాలు, నిజాం, మైసూర్ పాలకుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో కీ రోల్ పోషించారు సంత్ సేవాలాల్. బంజారాలు ఇతర మతాలు, సాంప్రదాయాల్లోకి మారకుండా సేవాలాల్ ప్రయత్నాలు చేసి.. వారికి ఆరాధ్యదైవంగా చెరగని ముద్రవేశారు. బంజారా భాషకు లిపి అందించిన సేవాలాల్.., బంజారాల వేషధారణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూశారు.

Tags:    

Similar News