తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఈరోజు మ.1.30 గంటలకు ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసే అవకాశముంది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు. కాగా సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.
గురువారం జరిగే భేటీలో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపి, వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఆయన ఇద్దరు నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గురువారమే మోదీ, అమిత్‌షాలతో భేటీ అవుతున్నారు.
విభజన సమస్యలపై ఇరురాష్ట్రాల సీఎంలు 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కావడానికి ముందు ఇద్దరూ దిల్లీలో ప్రధాని, హోంమంత్రులను కలవనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే... దిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం ఈ భేటీ సమయాలను ఇంకా ధ్రువీకరించలేదు.