Congress CM candidate: తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి వీరేనట
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎంపిక పద్ధతి వేరుగా ఉంటుందన్నారు.;
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రుల అభ్యర్థులపై ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థుల పేర్లను బయటపెట్టారు. కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులే అంటూనే..రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర్ రాజనర్సింహ, సీతక్కతో పాటు.. చాలా మందే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎంపిక పద్ధతి వేరుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానం తీసుకుంటుందని తెలిపారు. నాయకులందరితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి అవుతారని మాణిక్‌రావు ఠాక్రే కౌంటర్ ఇచ్చారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనపై మాణిక్‌రావు ఠాక్రే మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను సహించలేక..తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుల అభ్యున్నతికి, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాణిక్‌రావు ఠాక్రే స్పష్టంచేశారు.