హుజూరాబాద్‌లో దళితబంధు.. రూ. 500 కోట్లు విడుదల..!
పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.;
హుజూరాబాద్‌లో దళితబంధు అమలు కోసం తెలంగాణ సర్కారు నిధులు విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని రూ.2వేల కోట్లతో అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
ఈ పథకం క్రింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నారు. అయితే ఇంతకు ముందు వాసాల మర్రి వెళ్లిన సీఎం అక్కడి నుంచే దళిత బంధు పథకం మొదలు పెట్టి 70 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.7 కోట్ల నిధులను విడుదల చేశారు. తాజాగా హుజూరాబాద్‌లో రూ.500 కోట్లు విడుదల చేసిన సీఎం.. వాటిని ఎంపిక చేసిన లబ్ధిదారులకు త్వరగా చేరవేయమని కరీంనగర్ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.