దళితబంధు పథకం కోసం మరో రూ.500 కోట్ల నిధుల విడుదల..!
దళితబంధు పథకం కోసం మరో 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.;
దళితబంధు పథకం కోసం మరో 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కోసం ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ విడుదల చేసిన నిధులతో మొత్తం వేయి కోట్ల రూపాయలు జమ అయ్యాయి. హుజూరాబాద్ సభ తరువాత.. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలు కోసం 2వేల కోట్ల నిధులు విడుదల చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దళితబంధు కోసం రెండు విడతలుగా వేయి కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.. వారం రోజుల్లోగా మరో వేయి కోట్లు విడుదల చేస్తామని చెబుతోంది. మరో వారంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 2వేల కోట్ల నిధులు నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.