రాష్ట్రంపై ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రోజుకు రూ.196 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను చెల్లించేందుకు రేవంత్ సర్కార్ గత 6 నెలల్లో రూ. 25వేల కోట్లు అప్పుగా తీసుకుంది. తద్వారా రూ. 38,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించగలిగింది. అన్ని నిధులను రుణాలు & అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి చెల్లించడానికి వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్నా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన అనంతరం లోటు బడ్జెట్‌గా మారిందని శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. అప్పుడు రూ.70 వేల కోట్లలోపే అప్పు ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో అది పది రెట్లు పెరిగి ఏడున్నర లక్షల కోట్లకు చేరుకుందని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.