తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో గవర్నర్ ములుగు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో రెస్ట్ తీసుకుని.. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాట్లుచేసింది. పర్యటన తర్వాత గవర్నర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.